ఇటీవల బాలీవుడ్ సినిమా డెలివర్ చేసిన ఒక బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “ధురంధర్”(Dhurandhar). టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ లో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా దేశ భక్తి అంశాలు కూడా ఆడియెన్స్ ని ఎంతో కదిలించాయి.
అంతే కాకుండా ఇందులో కొన్ని పాకిస్తాన్ నేపథ్యంలో చూపించిన సన్నివేశాలకి ఆడియెన్స్ లో రక్తం మరిగింది. అలాంటి కొన్ని కీలక సన్నివేశాల్లో ముంబై టెర్రర్ ఎటాక్ సీన్ కూడా ఒకటి. ఇందులో నటులు అర్జున్ రాంపాల్, అక్షయే ఖన్నా లపై తీసిన సన్నివేశంపై నటుడు మాధవన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
ఆ సీన్ చేసిన తర్వాత ఆ ఇద్దరు నటులు ఎంతో ఏడ్చేశారని తెలిపారు. ఒరిజినల్ గా అక్కడ భారతీయులు చనిపోతూ ఉంటే పాకిస్తానీలు దానిని లైవ్ లో చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ సన్నివేశాన్ని వీరు చేయాలి. కానీ ఒక భారతీయులుగా అలాంటి సన్నివేశం చేసి వీరు ఆ బాధలో ఇద్దరు నటులు ఏడ్చేశారని మాధవన్ తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.


