ఈమధ్య విడుదలైన ట్రైలర్లలో ‘రాకెట్రి- ది నంబియార్ ఎఫెక్ట్ ‘ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్రో శాస్త్రవేత్త, గూఢచర్యం కేసులో తప్పుడు ఆరోపణల వలన అరెస్ట్ అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ట్రైలర్లో చూపించిన కంటెంట్ ప్రేక్షకుల మీద మంచి ఇంపాక్ట్ చూపించింది. ఒక గొప్ప శాస్త్రవేతకు జరిగిన అన్యాయానికి అందరూ బాధపడ్డారు. ఇలాంటి సినిమా చేస్తున్నందుకు మాధవన్ మీద ప్రశంసలు కురిపించారు.
ప్రేక్షకులే కాదు భారతదేశ ప్రధాని కూడ సినిమా గురించి తెలుసుకుని నంబి నారాయణన్, మాధవన్ ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడరట. ఈ సంగతిని మాధవన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ‘కొన్ని వారాల క్రితం ప్రధాని నుండి పిలుపు వచ్చింది. మా కొత్త సినిమా ‘రాకెట్రి’ గురించి మాట్లాడుకున్నాం. క్లిప్స్ చూసి ప్రధాని స్పందించిన తీరు ఎంతో గొప్పగా ఉంది. నంబి నారాయణన్ గారికి జరిగిన అన్యాయం పట్ల మోడీ చింతించారు. మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి ధన్యవాదాలు సర్’ అంటూ ఆ సమావేశంలో జరిగిన సంఘటనలను చెప్పుకొచ్చారు. దర్శకుడు అనంత మహదేవన్ సహకారంతో మాధవన్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సూర్య,షారుక్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.


