స్టార్ నటుడు మాధవన్ ఎంతో ఇష్టంగా చేస్తున్న ప్రాజెక్ట్ ‘రాకెట్రి-ది నంబియార్ ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త, గూఢచర్యం కేసులో తప్పుడు ఆరోపణల వలన అరెస్ట్ అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దీన్ని దర్శకుడు అనంత మహదేవన్ సహకారంతో మాధవన్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ఒక వర్గం ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. మాధవన్ సైతం ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సినిమా కూడ ఈ ఆరు భాషల్లో విడుదలవుతుంది. ఇందులో మాధవన్ మూడు దశల్లో ఉండే నారాయణన్ పాత్రలో కనిపిస్తారు. అందులో వయసు మళ్ళిన నారాయణన్, మధ్య వయసుల్లోని నారాయణన్ షేడ్స్ కోసం మాధవన్ రెండేళ్లపాటు తెల్లగడ్డం పెంచారు. ఈ సినిమా కోసం మాధవన్ చాలానే కష్టపడ్డారు.


