మాధురి దీక్షిత్ బయోపిక్ పై క్లారిటీ వచ్చేసిందిగా…!

Published on May 28, 2019 9:37 am IST

మాధురి దీక్షిత్…, ఈ పేరు వింటేనే అందం,అభినయంతో పాటు మనసుని కట్టిపడేసే డాన్స్ లు గుర్తుకువస్తాయి. దాదాపు 30 ఏళ్ల సినీ ప్రస్థానం ఉన్న మాధురి దీక్షిత్ బయో పిక్ తెరకెక్కనుందని కొన్నిరోజులుగా బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది మాధురి.

ఓ వార్తా పత్రిక సమక్షంలో ” నా జీవిత చరిత్ర పై సినిమా తీయనున్నారు అని వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే, అందులో ఎటువంటి నిజం లేదు. నా జీవితంలో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పుకార్లను నమ్మకండి” అని చెప్పిఒక స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మాధురి తాజాగా “కళంక్” అనే మూవీలో ఓ కీలకపాత్ర చేశారు.

సంబంధిత సమాచారం :

More