
బెంగాలీ ముద్దుగుమ్మ అయిన మధురిమ బెనర్జీ ఆ ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సరదాగా కాసేపు, షాడో లాంటి సినిమాల్లో కనిపించింది. ఇటీవలే ఈ భామ అటు అమలాపురం అంటూ కొత్త జంట సినిమాలో ఐటం సాంగ్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఏడాది మరోసారి ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకోవడానికి సిద్దమవుతోంది. అది ఎవరి సినిమాని కాదు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో కావడం విశేషం.
సుధీర్ వర్మ డైరెక్షన్ లో నాగ చైతన్య చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో మధురిమ ఐటం సాంగ్ ఓ కీలక పాయింట్ లో వస్తుందని, ఆ సాంగ్ ఆడియన్స్ లో ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. మధురిమ వచ్చే వారం రిలీజ్ కానున్న టెంపర్ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇది కాకుద్నా మధురిమ ప్రస్తుతం పలు తమిళ్, మలయాళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

