
వివాదాస్పద మరియు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. వర్మ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. వర్మ ఇప్పటికే డిపార్ట్ మెంట్ సినిమాలో డైరెక్ట్ చేసిన మధు శాలినిని ఈ సినిమాలో కూడా తీసుకున్నారు. మధు శాలిని ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.
సీరియల్ కిల్లర్ కథాశంతో థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మంచు విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మంచు విష్ణు చివరి సినిమా ‘రౌడీ’ కూడా వర్మ డైరెక్షన్ లోనే చేయడం విశేషం.
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న విష్ణు సినిమా కాకుండా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ‘పట్ట పగలు’ సినిమా జూన్ 6న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.