సినిమాలు, వెబ్ సిరీస్ లు, ప్రత్యేక కార్యక్రమాల తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా వీడియో ఇప్పుడు మరొక కార్యక్రమం తో ముందుకు రానుంది. సెప్టెంబర్ 10 వ తేదీన డిజిటల్ ప్రీమియర్ గా మహ గణేష్ ప్రసారం కానుంది. గజాసురుడు శివుడు ని ఎలా మెప్పించాడు, దాని పరిణామాలు ఏంటో తెలియాలి అంటే మహ గణేష్ ను చూడాల్సిందే అంటూ ఆహా వీడియో చెప్పు కొస్తుంది. యానిమేషన్ తరహా లో రూపొందిన ఈ చిత్రం పిల్లల కి వినోదం తో పాటుగా విజ్ఞానం కూడా అందించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
