మాస్ మోడ్ లో పవర్ స్టార్.. ‘ఉస్తాద్’ నుంచి నెక్స్ట్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ మాస్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh). దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కావాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని పవన్ పై ఊహించని పోస్టర్ తో రివీల్ చేశారు. కాలరే ఎత్తరా అంటూ సాగే పవర్ఫుల్ సాంగ్ ని మేకర్స్ ఈ మార్చ్ 12న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఇక దీనిపై వదిలిన పోస్టర్ లో పవన్ మాస్ మోడ్ లో కనిపిస్తున్నారని చెప్పవచ్చు. గబ్బర్ సింగ్ లో ఎంత మాస్ అండ్ నాటుగా కనిపించారో మరోసారి తలకి గుడ్డ కట్టి గబ్బర్ సింగ్, జానీ తరహాలో కనిపిస్తున్నారు. ఇక దీనిపై ప్రోమోని ఈ సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు కూడా రివీల్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ మార్చ్ 19న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version