సముద్రంలో ‘మహా సముద్రం’ ఫైట్ ?

Published on Jul 4, 2021 1:23 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా రాబోతున్న ‘మహా సముద్రం’లో ఓ కీలక సీక్వెన్స్ ను సముద్రంలో ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్వెల్ కి వచ్చే ఫైట్ సీక్వెన్స్ అట ఇది. సినిమాలో మొదటిసారి కలుసుకునే శర్వానంద్ – సిద్ధార్ద్ పాత్రలు నడి సముద్రంలో ఒకరి పై ఒకరు ఎటాక్ చేసుకుంటారని, ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

ఇక శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడట. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందట.

కాగా వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో అనే ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో ఎలా కనిపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :