కృష్ణా జిల్లాలో ‘మహానటి, అభిమన్యుడు’ కలెక్షన్స్ !

కృష్ణా జిల్లాలో ‘మహానటి, అభిమన్యుడు’ కలెక్షన్స్ !

Published on Jun 9, 2018 12:55 PM IST


నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే విశాల్ ‘అభిమన్యుడు’ కూడ మంచి టాక్ తో నడుస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడ హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభదాయకంగా మారాయి. కృష్ణా జిల్లాలో నిన్న కూడ రూ.1.4 లక్షల షేర్ అందుకున్న ‘మహానటి’ మొత్తంగా 31 రోజులకు కలిపి రూ.2.25 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

అలాగే ‘అభిమన్యుడు’ నిన్న రూ.2.18 లక్షల షేర్ తో 8 రోజులకు కలిపి రూ.47 లక్షల షేర్ ను ఖాతాలోకి వేసుకుంది. ఇక రజనీ ‘కాలా’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతున్నా ‘అభిమన్యుడు, మహానటి’ సినిమాలకు పెద్దగా అడ్డంకిగా మారలేదు. కాబట్టి ఈ సినిమాలు వచ్చే వారంలో ‘సమ్మోహనం, నా నువ్వే’ లాంటి కొత్త చిత్రాలు విడుదలయ్యే వరకు మంచి షేర్ ను కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు