శర్వానంద్‌ తో రొమాన్స్ చేయనున్న మాళవిక నాయర్?

శర్వానంద్‌ తో రొమాన్స్ చేయనున్న మాళవిక నాయర్?

Published on Feb 1, 2024 9:01 AM IST


టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మనమే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హీరో నెక్స్ట్ సినిమా కి సంబందించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారుతోంది. తన నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా మహానటి ఫేమ్ మాళవిక నాయర్ ను తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లూజర్‌ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో తన తదుపరి వెంచర్‌లో శర్వానంద్ నటించనున్నారు. ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్ కోసం మాళవిక నాయర్ ను సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాకి హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు