నైజాంలో ‘మహానటి’ 9 రోజుల కలెక్షన్స్ డిటైల్స్ !
Published on May 18, 2018 12:00 pm IST

తన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న పాత తరం హీరోయిన్ సావిత్రిగారి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ లో దూసుకెళుతోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే 2 మిలియన్ మార్క్ చేరువలో ఉన్న ఈ చిత్రం నైజాం ఏరియాలో కూడ బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది.

5 రోజులకుగాను రూ.3.47 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం 9వ రోజు రూ. 49,138,38 లక్షల షేరును కలెక్ట్ చేసి మొత్తంగా 9 రోజులకు గాను రూ. 5.89 కోట్ల షేర్ ని సాధించింది. ఈ వారంలో విడుదలయ్యే పెద్ద సినిమాలు ఏవీ లేనందున ఈ సినిమాకు కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలుగదు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook