రేపటి తో మహర్షి షూటింగ్ పూర్తి కానుంది !

Published on Apr 17, 2019 6:46 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ రేపటి తో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచనున్నారు చిత్ర యూనిట్.

సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది. మరి గత ఏడాది సమ్మర్ లో భరత్ అనే నేను తో వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఈ సమ్మర్ లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :