పోటీ వద్దంటున్న మహేష్, బన్నీ అభిమానులు

పోటీ వద్దంటున్న మహేష్, బన్నీ అభిమానులు

Published on Jan 3, 2020 12:57 PM IST

Sarileru Ala

రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున వస్తున్నాయంటే అభిమానులు సంభరపడటం గతంలో మాట, కానీ ఇప్పుడు సినిమా థియేటర్లలో నడిచే సమయమే తగ్గిపోవడంతో పెద్ద సినిమాల మధ్య క్లాష్ అంటే నో అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, మహేష్ బాబు అభిమానుల పరిస్థితి ఇదే. తొలుత రెండు చిత్రాలు జనవరి 12న రిలీజ్ అనగానే కంగారుపడిన ఫ్యాన్స్ తర్వాత ‘సరిలేర నీకెవ్వరు’ డేట్ 11కు మారడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కానీ కొత్తగా మళ్లీ టెంక్షన్ మొదలైంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా జనవరి 11న లేదా 10కి మారే అవకాశం ఉందనే వార్తలు రావడంతో ఎక్కడ రెండు సినిమాలు ఒకే తేదీన వస్తాయో అని కంగారుపడుతున్నారందరూ. ఒకవేళ డేట్స్ మార్చే పరిస్థితే వస్తే ఇరు సినిమాల నిర్మాతలు ఒక ఒప్పందం మీద పోటీని తప్పిస్తే బెటర్ అని, అప్పుడే రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని అంటున్నారు. మరి నిర్మాతలు ఏం డిసైడ్ చేస్తారో ఈరోజు సాయంత్రానికి తేలిపోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు