మహేష్-బన్నీ మధ్య సమ్మర్ వార్..!

Published on Jun 3, 2020 8:31 am IST

ఈ సంక్రాంతికి మహేష్ మరియు బన్నీ మధ్య తీవ్ర పోటీ నడిచింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఇద్దరు స్టార్ హీరోలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠంపురంలో చిత్రాలతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేశారు. కాగా మళ్ళీ మహేష్ బన్నీ మరో మారు పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తుండగా కేరళలో ఈ చిత్రం ఓ చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ నందు బన్నీ పాల్గొనలేదు. ఇక మహేష్ దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట మూవీ ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు కొద్దిరోజులలో షూటింగ్ కి వెళ్లనున్నాయి. బన్నీ ఇప్పటికే 2021 సమ్మర్ టార్గెట్ గా పెట్టుకోగా, మహేష్ సర్కారు వారి పాట సైతం అప్పుడే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వీరిద్దరి మధ్య ఆసక్తికర సమ్మర్ వార్ నడవనుంది.

సంబంధిత సమాచారం :

More