మహేష్, బన్నీకి ఓ ప్యాన్ ఇండియా మూవీ కావాలి?

మహేష్, బన్నీకి ఓ ప్యాన్ ఇండియా మూవీ కావాలి?

Published on Sep 18, 2019 7:07 AM IST

తెలుగు పరిశ్రమ భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం సౌత్ ఇండియా పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని చిత్రాలు చేసేవారు. సౌత్ లోని ప్రధాన చిత్ర పరిశ్రమలైన తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలో మార్కెట్ విస్తరణే లక్ష్యంగా తెలుగు స్టార్ హీరోలు ఉండేవి. బాహుబలి చిత్రం తరువాత ఆ పంధా మారింది.

దమ్మున్న యూనివర్సల్ కథతో సినిమాలు తీస్తే నార్త్ ప్రజలు బ్రహ్మరధం పడతారని బాహుబలి నిరూపించింది. సినిమా నచ్చితే ప్రాంతీయ భేదాలు. అలాగే సౌత్, నార్త్ హీరో అనే తేడాలు ఉండవని ఇటీవల విడుదలైన సాహో ద్వారా ప్రభాస్ నిరూపించారు. సాహో సౌత్ కి మించిన ఆదరణ నార్త్ లో దక్కించుకోవడం గమనార్హం.

బాహుబలి స్పూర్తితో తెలుగులో వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు తెరకెక్కుతున్నాయి. చిరంజీవి సైరా, ఎన్టీఆర్, తారక్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రాలు. తెలుగులో స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, చిరు, రామ్ చరణ్ ప్యాన్ ఇండియా చిత్రాలతో నటిస్తుండగా మరో ఇద్దరు స్టార్ హీరోలు ఆ ఫీట్ కి ఇంకా దూరంలో ఉన్నారు.

మహేష్, బన్నీ లు మాత్రం ఇంకా ప్యాన్ ఇండియా మూవీ చేయలేదు. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మహేష్ కి ఇంకా ఆ అవకాశం రాకపోవడం గమనార్హం. మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరో అయిన మహేష్ తో బాలీవుడ్ చిత్రం తీయాలని ప్రయత్నించినా ఆయన సుముఖత చూపలేదు. ఇంకా బన్నీ పరిస్థితి కూడా అలానే ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బన్నీ కి మలయాళం లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆయన నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాధం హిందీ వెర్షన్స్ కి విశేష ఆదరణ దక్కింది. ప్యాన్ ఇండియా మూవీకి పర్ఫెక్ట్ గా సరిపోయే ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు