ఉత్తమ నటీనటులుగా ఎంపికైన నిత్యామీనన్, మహేష్ బాబు

ఉత్తమ నటీనటులుగా ఎంపికైన నిత్యామీనన్, మహేష్ బాబు

Published on Jul 12, 2014 3:15 PM IST

mahesh-nitya
సూపర్ స్టార్ మహేష్ బాబుకి మరోసారి ఫిలింఫేర్ వరించింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఆయన నటనకు ఈ అవార్డు అందుకున్నారు. గతంలో ఒక్కడు, పోకిరి మరియు దూకుడు సినిమాలకు ఈ అవార్డులు ఆయన్ని వరించాయి

ఉత్తమ నటి పురస్కారాన్ని గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకు గానూ నిత్యామీనన్ సొంతం చేసుకుంది. మహేష్ కెరీర్ లో ‘సీతమ్మ వాకిట్లో..’ చిత్రం మరపురాని సినిమాగా నిలిచింది. 25సంవత్సరాల తరువాత మల్టీ స్టారర్ గా రూపుదిద్దుకున్నఈ సినిమాలో మరో అగ్రనటుడు వెంకటేష్ తో కలిసి నటించాడు.

ఈ ఇద్దరికీ 123తెలుగు. కామ్ ద్వారా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు