ఒకే తేదీన ర్యాంపాడించిన పవన్, మహేష్ చిత్రాలు.!

Published on Sep 27, 2020 3:29 pm IST

సూపర్ స్టార్ మహేష్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు అనే విజువల్ కన్నా ముందు పక్క పక్కనే ఈ ఇద్దరు పేర్లు ఉంటేనే ఆ హై తమ అభిమానుల నడుమ వేరే లెవెల్లో ఉంటుంది. ఎలాంటి విషయంలో అయినా సరే మంచి రసవత్తరమైన పోటీ వీరిద్దరి నడుమ ఉంటుంది. అలాగే వీరి అభిమానుల మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది.

మరి అలా ఈ ఇద్దరి కోసం ఒకేసారి టాపిక్ వచ్చింది అంటే వారి అభిమానుల నడుమ పెద్ద చర్చగానే నడుస్తుంది. ఆ మధ్య పవన్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ ట్వీట్ చేయడం దానికి పవన్ రిప్లై ఇవ్వడం చెప్పలేని పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. మరి అలాంటిది ఈరోజు ఈ ఇద్దరు హీరోలు నటించిన రెండు చిత్రాలు విడుదల కాబడిన తేదీలు కావడం ఒక యాదృచ్చికం అయితే ఈ రెండు చిత్రాలకు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా ఒక భాగస్వామి కావడం మరో యాదృచ్చికం.

అవే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “అత్తారింటికి దారేది”, మహేష్ నటించిన “స్పైడర్”. ఈ రెండు చిత్రాల ఫలితాలను పక్కన పెట్టి కేవలం ఓపెనింగ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర ఇదే సెప్టెంబర్ 27వ తేదీన మూడేళ్ల గ్యాప్ లో విడుదలై ర్యాంపాడించాయి. దీనితో ఇపుడు ఈ రెండు చిత్రాలపై సోషల్ మీడియాలో ట్రెండ్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న “వకీల్ సాబ్” కానుండగా మహేష్ నటిస్తున్న మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట” షూట్ కు రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More