మహేష్ కోసం కథ రాశాడట !

Published on Jan 17, 2021 7:57 pm IST

రాజమౌళి తరువాత సినిమా మహేష్ తో చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా పై కూడా అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పటికే, రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ కోసం విజేంద్రప్రసాద్ కథ రాసాడని.. ఆ కథ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఎప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది.

ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :