మహేష్ ఆటిట్యూడే టీజర్ కి హైలెట్ అట

Published on Nov 21, 2019 10:21 am IST

మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటలలో మహేష్ టీజర్ తో సత్తా చాటనున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న మహేష్ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. దీనితో అభిమానులు టీజర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ ని ఎలా చూపించబోతున్నారు అని ఆసక్తిగా మరియు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐతే సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ ఆటిట్యూడ్ అండ్ డైలాగ్ డెలివరీ హైలెట్ గా ఉంటుందట. విలన్స్ ముందు ఆయన హీరోయిజం తెరపై పేలడం ఖాయం అని తెలుస్తుంది. దీనికోసం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని సమాచారం.

అనిల్ రావిపూడి గత చిత్రాలైన పటాస్, సుప్రీం లలో సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్ లను ఒక రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు. మరి మహేష్ లాంటి సూపర్ స్టార్ ని ఈయన అదిరిపోయేలా చూపించి ఉంటారు అనడంలో సందేహం లేదు. మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, విజయ శాంతి కీలక రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More