మహేష్ బాబు ‘ఆగడు’ రిలీజ్ డేట్

మహేష్ బాబు ‘ఆగడు’ రిలీజ్ డేట్

Published on Jun 28, 2014 11:24 AM IST

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బళ్లారిలో జరుగుతోంది. జూలై 2 వరకు బళ్ళారిలో జరగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ చిత్ర టీం ముందుగా ఈ సినిమాని సెప్టెంబర్ 26న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

కానీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనుకున్నదాని కంటే ఒక వారం ముందుగానే అనగా సెప్టెంబర్ 19న మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 19న కచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుందని చిత్ర వర్గాలు కూడా చెబుతున్నాయి. మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ ఐటెం సాంగ్ చేయనుండడం మరో విశేషం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టులో రిలీజ్ చేయడానికి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సన్నాహాలు చేసుకుంటున్నారు.

తాజా వార్తలు