మహేష్ పనిచేయాలనుకునే తమిళ్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?

mahesh-babu
టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు, ఘట్టమనేని అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆగష్టు 7న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మహేష్ తమిళ్లో కూడా తన మార్కెట్ పెంచుకోవడానికి చూస్తున్నారు. తమిళంలో ఈ నేమా టైటిల్ ‘సెల్వందన్’. తమిళ్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో తమిళ మూవీ ఆడియోని జూలై 31న రిలీజ్ కానుంది. ఈ ఆడియో మహేష్ బాబు అటెండ్ అవ్వడమే కాకుండా చెన్నైలో కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు.

శ్రీమంతుడు ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ తన మనసులోని ఓ కోరికని బయటపెట్టాడు. శ్రీమంతుడు సినిమాతో తమిళంలో కూడా ఎంటర్ అవుతున్నారు. మరి తమిళంలో మీరు చేయాలనుకునే డైరెక్టర్ ఎవరు అని అడిగితే ‘ నాకు ఎఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయన డైరెక్షన్ లో ఓ ద్విభాషా(తెలుగు, తమిళ్) సినిమా చేయాలని ఉందని’ మహేష్ బాబు తెలిపాడు. మురుగదాస్ ఓ సోషల్ మెసేజ్ ని చాలా కమర్షియల్ యాంగిల్ లో చెబుతుంటాడు. గజినీ, స్టాలిన్, తుపాకీ సినిమాలతో ఎఆర్ మురుగదాస్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. మరి మురుగదాస్ ఈ కోరికను తెలుసుకొని మహేష్ బాబుతో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

Exit mobile version