హైదరాబాద్లో సందడి చేస్తున్న ‘ఆగడు’ టీం

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే బళ్ళారి వ్ల్లోచ్చిన ఈ టీం అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ హైదరాబాద్ షెడ్యూల్ జూలై 18 వరకూ జరగనుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా కీలక సన్నివేశాలను మరియు శృతి హాసన్ పై వచ్చే ఐటెం సాంగ్ ని షూట్ చేయనున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక మరో షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం కేరళ వెళ్లనుంది. మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 19న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేసుకుంటోంది.

Exit mobile version