
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వకేషణ్ ని పూర్తి చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ మలేషియాలో జరిగింది. మే 2తో మలేషియా షెడ్యూల్ ని పూర్తి చేసిన మహేష్ బాబు కొద్ది రోజులు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వకేషణ్ కోసం వెళ్ళారు. నిన్నటితో మహేష్ బాబు తన ఫ్యామిలీ టూర్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు.
నేటి నుంచి మళ్ళీ మహేష్ బాబు బ్యాక్ టు షూట్ అంటూ మరో కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నాడు. మహేష్ తో పాటు పలువురు నటీనటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో మహేష్ ఓ ఎన్నారైగా కనిపించనున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా కోసం ‘శ్రీ మంతుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31న మహేష్ బాబు శ్రీ మంతుడు ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యడమే కాకుండా తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ని కూడా లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ బాబుసరసన మొదటి సారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, పూర్ణ, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చేయనున్నారు.

