
సూపర్ స్టార్ మహేష్ బాబు – అందాల భామ శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన మహేష్ బాబు కూడా నిన్నటి నుంచి తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ మొదలు పెట్టాడు. మరో నాలుగు రోజులు కంటిన్యూగా డబ్బింగ్ చెప్పి తన పార్ట్ డబ్బింగ్ వర్క్ ని ఫినిష్ చేస్తాడు. ఇప్పటికే మిగిలిన చాలా మంది నటీనటుల డబ్బింగ్ వర్క్స్ ఫినిష్ అయ్యాయి.
జూలై 18న శ్రీమంతుడు సినిమా ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మహేష్ బర్త్ డే కానుకగా ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మహేష్ ఈ సినిమాలో ఓ రిచ్ కిడ్ మరియు అబ్రాడ్ నుంచి వచ్చిన కుర్రాడిగా కనిపించనున్నాడు. మైత్రి మూవీస్ వారు మహేష్ బాబుతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ వర్క్ ఫినిష్ చెయ్యగానే మహేష్ బాబు జూలై 10 నుంచి ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ని మొదలు పెడతాడు.

