ఫస్ట్ హాఫ్ కి డబ్బింగ్ ఫినిష్ చేసిన మహేష్ బాబు

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘శ్రీమంతుడు’కి ‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్టర్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ సూపర్బ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రానున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే మహేష్ బాబు ట్టన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడని తెలియజేశాం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ కి డబ్బింగ్ ఫినిష్ చేసాడు. త్వరలోనే సెకండాఫ్ కి సంబందించిన డబ్బింగ్ మొదలు పెట్టాడు.

డబ్బింగ్ పరంగా మహేష్ బాబు చెప్పాల్సిన సెకండాఫ్ తప్ప మిగతా అందరి నటీనటుల డబ్బింగ్ వర్క్ ఫినిష్ అయ్యింది. మరో వైపు ఎడిటింగ్, రీ రికార్డింగ్ వర్క్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. జూలై 18న శ్రీమంతుడు సినిమా ఆడియోని గ్రాండ్ గా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మహేష్ బర్త్ డే కానుకగా ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మహేష్ ఈ సినిమాలో ఓ రిచ్ కిడ్ మరియు అబ్రాడ్ నుంచి వచ్చిన కుర్రాడిగా కనిపించనున్నాడు.

మైత్రి మూవీస్ వారు మహేష్ బాబుతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version