‘గీత గోవిందం’తో ఎట్టకేలకు పరుశురామ్ తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల రూపాయల భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే పరుశు రామ్ ఇప్పటికే మహేశ్ కి ఒక లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేశ్ కూడా స్క్రిప్ట్ వర్క్ చేసుకోని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పరుశురామ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
మరి ఫుల్ స్క్రిప్ట్ తో పరుశు రామ్ మహేశ్ ను ఒప్పిస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం మహర్షి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు జూలై నుండి అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు.
