మహేష్ బాబుకి కాంపిటీషన్ లేదంటున్న నమ్రత

మహేష్ బాబుకి కాంపిటీషన్ లేదంటున్న నమ్రత

Published on May 11, 2014 12:09 PM IST

mahesh_n_namratha
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారిగా నేషనల్ లెవల్లో బ్రాండ్ గా మారడానికి కారణం నమ్రత అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. గత 4 సంవత్సరాల్లో మహేష్ బాబు ఇమేజ్ చాలా పెరిగింది. అలాగే ఇండియాలో టాప్ బ్రాండ్స్ అయిన థమ్స్ అప్, ఐడియా, జోస్ అలుక్కాస్, వివెల్ లాంటి బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసాడు.

ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు భార్య నమ్రత తన ఇండియన్ బ్రాండ్స్ అన్నిటికీ తనే కారణం అని చెప్పింది. అలాగే మాట్లాడుతూ ‘నేను ఒక్క బ్రాండ్స్ విషయంలో తప్ప మిగతా ఏ మహేష్ విషయంలోనూ ఇన్వాల్వ్ కాను. ప్రస్తుతం తను ఉన్న స్థానం కోసం చాలా కష్టపడ్డాడు. నేను మహేష్ కలవకముందు, పెళ్లి చేసుకోకముందు నుంచే అతనికి పెద్ద అభిమానిని. నాకు తెలిసి మహేష్ కి కాంపిటీషన్ లేదు మరియు ప్రతి సినిమాలోనూ బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తూనే ఉంటాడని’ నమ్రత చెప్పింది.

అలాగే మాట్లాడుతూ గౌతమ్ ని 1-నేనొక్కడినే లో స్క్రీన్ పై చూడడం మరచిపోలేని అనుభవం అని చెబుతోంది. ‘మహేష్ కానీ నేను కానీ గౌతమ్ చేయగలడని మేము అనుకోలేదు. కానీ వాడు స్క్రీన్ పై మమ్మల్ని షాక్ అయ్యేలా చేసాడు. అలాగే గౌతమ్ కి యాక్షన్ సినిమాలు నచ్చవు. చెప్పాలంటే మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఒక్కటే గౌతమ్ చూసాడని’ నమ్రత చెప్పింది.

తాజా వార్తలు