‘పవన్’ది పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ – మహేష్

Published on Apr 11, 2021 8:37 am IST

పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “వకీల్ సాబ్” ద్వారా మరోసారి తెలిసి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ అనే మరోసారి రుజువు చేసింది వకీల్ సాబ్ సినిమా. మొత్తానికి ఈ సినిమాతో తానూ వకీల్ సాబ్ ను కాదు, బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో “వకీల్ సాబ్” సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘ముగ్గురు నటీమణులు నివేతా థామస్ మరియు అనన్య నాగళ్ళ, అంజలిలు వారి పాత్రల్లో హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ కూడా టాప్ లో ఉంది. ‘దిల్ రాజు, బోనికపూర్,దర్శకుడు వేణు శ్రీరామ్ మిగతా టీమ్ కి నా శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌ లో ఉన్నారు. వకీల్ సాబ్‌ లో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మహేష్ ట్వీట్ చేశాడు.

https://mobile.twitter.com/urstrulyMahesh/status/1380938634354782212

సంబంధిత సమాచారం :