
ప్రతి భాషలోనూ ఆ భాషకు చెందిన హీరోలకు అభిమానుల నుంచి ఫుల్ క్రేజ్ ఉండడం కామన్ విషయమే.. కానీ ఒక భాష హీరోకి మరో భాషలో క్రేజ్ రావడం అనేది చేలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా వచ్చిన వారిలో రజినీకాంత్, కమల్ హాసన్ లను ప్రధమంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అదే మానియాని మహేష్ బాబు చూపిస్తున్నాడు. అది కూడా పర భాష అయిన తమిళంలో కావడం విశేషం. అసలు విషయంలోకి వెళితే ఓ ఫేమస్ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో తెలుగు నుంచి మహేష్ బాబుకి తమిళనాడులో క్రేజ్ ఉన్నట్లు తెలిపారు.
తమిళంలో బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరు అని చేసిన సర్వేలో అజిత్ కి ఎక్కువ ఓట్ల మెజారిటీ వస్తే, తమిళ నాడు ప్రజలకి నచ్చిన ఫేవరైట్ తెలుగు స్టార్ హీరో ఎవరని జరిపిన సర్వేలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి అత్యధిక మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత రెండు స్థానల్లో అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు. ఈ లెక్క ప్రకారం తమిళ తంబిలు కోలీవుడ్ హీరోలలో అజిత్ కి ఉన్న క్రేజ్, తెలుగు హీరోలలో మహేష్ బాబుకు కూడా ఉందని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.