ఈ డేట్స్ లో “ఒక్కడు” రీ రీరిలీజ్.!

ఈ డేట్స్ లో “ఒక్కడు” రీ రీరిలీజ్.!

Published on Feb 20, 2024 10:00 AM IST

Okkadu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గుంటూరు కారం” ఇప్పుడు ఓటిటిలో కూడా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం సినిమా హడావుడి తర్వాత మళ్ళీ మహేష్ ఫ్యాన్స్ థియేటర్స్ లో సందడి చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. టాలీవుడ్ లో రీసెంట్ స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ ని మహేష్ బాబు అభిమానులే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. మరి ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం “ఒక్కడు” రీ రీరిలీజ్ కి సిద్ధం అయ్యింది.

మరి ఈ చిత్రాన్ని అయితే ఈ ఫిబ్రవరి 23,24, 25 తేదీలలో అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్పెషల్ షోస్ తో విడుదల చేయబోతున్నారు. మరి ఈసారి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా భూమిక హీరోయిన్ గా నటించింది. అలాగే మణిశర్మ సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ మరియు బాక్గ్రౌండ్ స్కోర్ ని అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు