
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ లోని ఆరడుగుల అందగాడు. అయితే అతి త్వరలో మహేష్ కి పోటిగా అక్కినేని అఖిల్ రాబోతున్నాడు. ఇటివల విడుదలైన ‘మనం’ సినిమాలో అఖిల్ చేసింది అతిథి పాత్రే కానీ ప్రేక్షకులలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
తాజాగా మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఖిల్ ని అభినందించాడు. అఖిల్ నటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తనకు అద్భుతమైన స్క్రీన్ ప్రేసేన్స్ ఉందని, టాలీవుడ్ కి మరో మంచి నటుడు రాభోతున్నాడని మహేష్ తెలిపాడు. ఈ సందర్బంగా ‘మనం’ సినిమా టీంని, దర్శకుడు విక్రమ్ కుమార్ ని మహేష్ పొగడ్తలతో ముంచెత్తాడు.
అక్కినేని కుటుంబం నుండి మరో మన్మధుడు అఖిల్ రూపంలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు.