“కల్కి” చిత్రంపై మహేష్ ప్రశంసలు

“కల్కి” చిత్రంపై మహేష్ ప్రశంసలు

Published on Jul 8, 2024 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఎడి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 900 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం పై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు చేరిపోయారు. ఈ చిత్రం ను చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా మైండ్ బ్లో అయ్యింది కల్కి చిత్రాన్ని చూసి, జస్ట్ వావ్. నాగ్ అశ్విన్, మీ ఫ్యూచరిస్టిక్ విజన్ కి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. అమితాబ్ బచ్చన్ సర్, మీ మహోన్నత స్క్రీన్ ప్రెజెన్స్ సాటి లేనిది. కమల్ హాసన్ సర్, మీరు పోషించే ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉండటానికి కారణం మీరే. ప్రభాస్, మీరు మరో గొప్ప చిత్రాన్ని చాలా సులభం గా చేశారు. దీపికా పదుకునే ఎప్పటిలాగే అద్బుతం. అద్బుత విజయం సాధించిన వైజయంతి మూవీస్ కి మరియు చిత్ర యూనిట్ కి అభినందనలు అని అన్నారు.

మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి టీమ్ మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్స్ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు