హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో పలువురు టాప్ స్టార్స్ మెరిశారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త మరియు ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్ ఒకే చోట చేరి స్పెషల్ మూవీ నైట్‌ను ఆస్వాదించారు. ఈ టాప్ స్టార్స్ రాకతో థియేటర్ ప్రాంగణమంతా ఒక్కసారిగా సినీ గ్లామర్‌తో మెరిసిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ స్టార్స్ అందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కంటికి పండగలా అనిపించింది. AMB సినిమాస్ యాజమాన్యం కూడా ఈ గ్లోబల్ స్టార్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తూ, ఈ క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇక మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
