‘ఉప్పెన’కు మహేష్ ఇచ్చిన సర్టిఫికెట్ ‘క్లాసిక్’

‘ఉప్పెన’కు మహేష్ ఇచ్చిన సర్టిఫికెట్ ‘క్లాసిక్’

Published on Feb 22, 2021 9:24 PM IST

మంచి సినిమా విడుదలైతే దాని గురించి మాట్లాడటానికి, దాన్ని మెచ్చుకోవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమాత్రం ఆలోచించరు. సినిమా నచ్చితే చాలు వెంటనే దాని మీద తన అమూల్యమైన అభిప్రాయాన్ని చెబుతుంటారు. తాజాగా ఆయన వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రాన్ని వీక్షించారు. చాలా ఆసక్తితో చూసిన ఆయనకు సినిమా బాగా నచ్చేసింది. ఎంతలా అంటే క్లాసిక్ అని కితాబిచ్చేంతలా. సినిమా చూసిన వెంటనే మహేష్ ‘ఒక్క మాటలో చెప్పాలంటే ఉప్పెన క్లాసిక్. బుచ్చిబాబు మీరు ఒక గొప్ప చిత్రాన్ని రూపొందించారు. మీ పట్ల చాలా గర్వంగా ఉంది’ అన్నారు.

అంతేకాదు ‘ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం గుండె లాంటిది. దేవిశ్రీ.. ఈ సినిమా మీ బెస్ట్ వర్క్. ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం ఇచ్చారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి ఇద్దరు కొత్త నటీనటులు ఇంత గొప్పగా నటించడం హృదయాన్ని కదిలించింది. మీరిద్దరూ స్టార్లు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మహేష్ రెస్పాన్స్ చూస్తే ఈమధ్య కాలంలో ఆయనకు అమితంగా నచ్చిన చిత్రం ఇదేనేమో అనిపిస్తోంది. ఏమైనా మహేష్ లాంటి స్టార్ నటుడి నుండి ఈ స్థాయి ప్రశంసలు అందుకోవడం అనేది ‘ఉప్పెన’ బృందానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు