మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

Published on Apr 23, 2012 12:38 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది.అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఒక పాట చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు మరియు కాజల్ అగర్వాల్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ మాస్టర్ అధ్వర్యంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. వీరు గతంలో మహేష్ బాబుతో ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు