
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు రాబోతున్న చిత్రం చిత్రీకరణ ఈరోజు నిలిపివేశారు. గత ఐదు రోజులుగా ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక్కడ మహేష్ బాబు మీద ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట చిత్రీకరణ సమయం లో మహేష్ బాబు స్వల్ప అనారోగ్య పాలయినట్టు సమాచారం. ఈ కారణంగా సుకుమార్ చిత్రీకరణ నిలిపివేసినట్టు తెలుస్తుంది ఈరోజు మహేష్ బాబు విశ్రాంతి తీసుకోనున్నారు. అభిమానులు భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం మహేష్ బాబు బానే ఉన్నారు. ముందుగానే అనుకున్నట్టు కాజల్ నిన్న చిత్ర బృందంతో కలిసింది ఈ పాట చిత్రీకరణ ఏప్రిల్ 30 వరకు జరగనుంది. అనిల్ సుంకర,ఆచంట రామ్ మరియు గోపీచంద్ లు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
నిలిచిపోయిన మహేష్ బాబు – సుకుమార్ చిత్రం చిత్రీకరణ
నిలిచిపోయిన మహేష్ బాబు – సుకుమార్ చిత్రం చిత్రీకరణ
Published on Apr 28, 2012 3:37 PM IST
సంబంధిత సమాచారం
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!

