త్వరలో గుజరాత్ వెళ్లనున్న ‘ఆగడు’ టీం

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో మహేష్ బాబుతో పాటు కొంతమంది ముఖమైన నటీనటులు కూడా పాల్గొంటున్నారు. ఇక్కడే మరి కొద్ది రోజులు ‘ఆగడు’ షూటింగ్ జరగనుంది.

అలాగే త్వరలోనే ఈ చిత్ర టీం గుజరాత్ లో జరగబోయే ఓ లాంగ్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్లనున్నారు. అక్కడ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే మహేష్ బాబుకి ఆస్థాన నిర్మాతలుగా మారిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version