త్వరలోనే ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌కు మహేష్!

mahesh-babu
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోగా, ఆ తర్వాత పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకొని ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళింది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ షెడ్యూల్ గత వారమై మొదలైనా మహేష్ ఇంకా షూటింగ్‌లో జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతం మహేష్ తన ‘శ్రీమంతుడు’ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ వారమే శ్రీమంతుడు ఆడియో కూడా విడుదల కానుంది. ఇక ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక మూడో వారంలో మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ నేపథ్యంలో తెరకెక్కే ఈ ఫ్యామిలీ డ్రామాలో మహేష్ ఫ్యామిలీలో సుమారుగా 50మందికి పైనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ 50 పాత్రలను తెలుగు సినిమాల్లో మంచి పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయనున్నారట. సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత ముగ్గురు హీరోయిన్లు నటించనుండడం విశేషం!

Exit mobile version