
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘దూకుడు’. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఇదే సినిమాని కన్నడలో రీమేక్ చేసారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ సినిమా టైటిల్ ‘పవర్’.
ఈ సినిమా ఆడియోని ఈ నెల 28న బళ్లారిలో లాంచ్ చేయనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహేష్ బాబు హాజరు కానున్నాడు. పునీత్ రాజ్ కుమార్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక్కడ హిట్ అయిన ఈ సినిమా అక్కడ కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

