‘మహేష్’ చేతుల మీదుగా హరోం హర ట్రైలర్

‘మహేష్’ చేతుల మీదుగా హరోం హర ట్రైలర్

Published on May 29, 2024 3:00 PM IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 14, 2024న రిలీజ్ కాబోతుంది. ఐతే, రేపు ఉదయం 11:25 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేస్తారని ఈరోజు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. సినిమాపై అంచనాలు పెరగాలంటే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండాలి. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు నటించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సుమంత్ జీ. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు