శర్వానంద్ కూడ మహేష్ బాబు దగ్గరికే

Sreekaram

యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న చిత్రం ‘శ్రీకారం’. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. దీంతో టీమ్ టీజర్ సిద్ధం చేశారు. ఈ నెల 9న అంటే రేపు టీజర్ రిలీజ్ చేయనున్నారు. దీన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా రివీల్ చేయనున్నారు. మహేష్ ఈమధ్య చిన్న సినిమాలకు మంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు.

సినిమా నచ్చితే ట్వీట్ చేసి మరీ తన అభిప్రాయాన్ని చెబుతున్నారు. మంచి సినిమాతో వచ్చి ఫేవర్ అడిగితే కాదనకుండా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడ అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా ట్రైలర్ తన చేతుల మీదుగానే విడుదలచేసి మంచి సపోర్ట్ ఇచ్చారు. అందుకే ‘శ్రీకాకరం’ టీమ్ సైతం ఆయన్ను అప్రోచ్ అయ్యారు. మొత్తానికి లాక్ డౌన్ అనంతరం పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలనే తన అభిప్రాయాన్ని ఈ విధంగా ఆచరణలో చూపిస్తున్నారు మహేష్. ఇకపోతే ఈ ‘శ్రీకారం’ చిత్రాన్ని మార్చి 11న రిలీజ్ చేయనున్నారు. ఇందులో శర్వాకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించడం జరిగింది.

Exit mobile version