‘శ్రీమంతుడు’ సక్సెస్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు సంబరాల్లో మునిగిపోయారు. ఆగష్టు 7న మహేష్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాక, ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథను చెప్పిన విధానానికి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక శ్రీమంతుడు విజయం సినిమాల ఎంపికలో మరింత బాధ్యత పెంచిందని తెలిపిన మహేష్, ప్రస్తుతం హాలీడేపై థాయ్‌ల్యాండ్ వెళ్ళారు.
ఇక హాలీడే నుంచి తిరిగి వచ్చిన వెంటనే మహేష్, తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌తో బిజీ కానున్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 14న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక సినిమా సినిమాకూ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పరంగా వేరియేషన్స్ చూపించే మహేష్, ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు లుక్స్ పరంగానూ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో మహేష్ రఫ్ లుక్‌లో కనిపిస్తారని సమాచారం. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాలో భారీ తారాగణమే ఉండనుంది.


