‘పోకిరి’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన వన్ లైన్ పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించాయి. ‘ఆగడు’లో పంచ్ డైలాగ్స్ ‘పోకిరి’ డైలాగులను బీట్ చేస్తాయని అంటున్నారు మహేష్ బాబు. ‘దూకుడు’ వంటి సూపర్ హిట్ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆగడు’ సినిమా విజయంపై చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నాడి హీరో.
‘ఆగడు’లో నా డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ చాలా కొత్తగా ఉంటుంది. శ్రీను వైట్ల & టీం డైలాగ్స్ పై చాలా కేర్ తీసుకున్నారు. సినిమా చూసిన తర్వాత అందరూ డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు. క్రెడిట్ మొత్తం దర్శకుడు శ్రీను వైట్లకు చెందుతుంది. అతను చెప్పింది నేను ఫాలో అయిపోయాను అని మహేష్ బాబు చెప్పారు.
మహేష్ బాబు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో కనువిందు చేయనుంది. తమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత. సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 థియేటర్లలో విడుదలవుతుంది.


