దత్తత గ్రామాన్ని దర్శించనున్న మహేష్ బాబు

Mahesh-srimantudu

సూపర్ స్టార్ మహేష్ బాబు మన గ్రామాలను మనమే దత్తత తీసుకొని మరీ బాగు చేసుకోవాలి అనే పాయింట్ తో తీసిన సినిమా శ్రీమంతుడు చాలా పెద్ద హిట్ అయ్యింది. అంతటితో ఊరుకోకుండా మహేష్ బాబు ఆంధ్ర నుంచి బుర్రి పాలెం మరియు తెలంగాణ నుంచి సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆ రెండు గ్రామాలను డెవలప్ చేసే భాద్యత తనే తీసుకున్నాడు. ముందుగా తెలంగాణలోని సిద్దాపురం గ్రామాన్ని డెవలప్ చేయడానికి సిద్దమయ్యారు. నిన్న మహేష్ ప్రజాసేన ఫాన్స్ సిద్దాపురం ని విజిట్ చేసి అక్కడి ప్రజలతో చర్చించి అక్కడి వారికి ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు.

ఈ నెల 15వ తేదీ అనగా రేపు మహేష్ బాబు సిద్దాపురం గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలపై గ్రామ ప్రజలతో మరోసారి చర్చించి డెవలప్ మెంట్ కి సంబందించిన పనులను మొదలు పెడతారు. అక్కడి గ్రామ ప్రజలు మహేష్ బాబు వారికి ముందుగా త్రాగునీరు సమస్యని, డ్రైనేజ్ లైన్ సమస్యలతో పాటు ఒక వెటర్నరీ హాస్పిటల్ అందు బాటులో ఉండే సదుపాయాలను కల్పించమని అడగనున్నారట. మహేష్ బాబు అక్కడి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిసి వెళ్లి అక్కడి డెవలప్ మెంట్ కి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ని మొదలు పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే మహేహ్స్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. హైదరబాద్ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం ఊటీకి వెళ్లనుంది.

Exit mobile version