ఎప్పుడైతే రీల్ లైఫ్ లో హీరోలుగా కనిపించే స్టార్స్ రియల్ లైఫ్ లో కూడా అసలైన హీరోలు అనిపించుకుంటారో అప్పుడు వారి పేరు ప్రఖ్యాతలు అమాంతం పెరిగిపోవడమే కాకుండా వారి అభిమానులు కూడా వారి బాటలోనే పయనించాలని అనుకుంటారు, వారిలానే పలు సామాజిక కార్యక్రమాలను చేపడతారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘మన పల్లెటూళ్ళని మనమే కాపాడుకోవాలని, అవసరం అయితే దత్తత తీసుకొని మరీ బాగు చెయ్యాలనే సందేశాన్ని’ ఇచ్చారు.
ఆ సందేశాన్ని మహేష్ బాబు సినిమాలో చెప్పి వదిలేయకుండా తన రియల్ లైఫ్ లో అదే పని చేయడానికి ముందుకు వచ్చాడు. అందులో భాగంగానే బుర్రిపాలెం మరియు మహబూబ్ నగర్లోని చింతలకుంట అనే విలేజ్ ని దత్తత తీసుకొని దానిని డెవలప్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ కోరిక కోరిక మేరకు మహేష్ బాబు చింతకుంట ప్రాంతాన్ని డెవలప్ చేయనున్నాడు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఆగష్టు 29న మహేష్ చింతలకుంట ని విజిట్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు చాలా హ్యాపీ గా ఉండడమే కాకుండా చాలా గర్వంగా కూడా ఫీలవుతున్నారు.


