మహేష్ బాబుతో విక్రమ్ కుమార్ సినిమా

మహేష్ బాబుతో విక్రమ్ కుమార్ సినిమా

Published on Jun 8, 2014 5:10 PM IST

Mahesh_babu_Vikram_Kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మనం’తో విజయం అందుకున్న విక్రమ్ కుమార్ తో కలిసి పని చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఈ వార్త అధికారికంగా తెలియజేయలేదు కానీ మాకున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉంది.

విక్రమ్ కుమార్ తీసిన ‘మనం’ సినిమా మహేష్ బాబుకి విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాకి వచ్చిన ఫలితం చూసాక మహేష్ బాబు విక్రమ్ తో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రమ్ కుమార్ చెప్పిన స్టొరీ లైన్ కూడా మహేష్ బాబుకి నచ్చిందని సమాచారం.

అన్ని అనుకున్నట్టే జరిగితే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

తాజా వార్తలు