ఈ మధ్య మహేష్ ఏ మంచి చిత్రాన్ని చూడకుండా వదిలేయడం లేదు. ఆయన ఓ పక్క ఫ్యామిలీ తో టైం గడుపుతూ, షూటింగ్ లో పాల్గొంటూనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి సినిమా అనిపిస్తే దానిపై ఆయన స్పందిస్తున్నారు. కాగా గతవారం విడుదలైన ఖైదీ చిత్రం పై ట్విట్టర్ వేదికగా ప్రసంశలు కురిపించారు. కొత్త తరహా చిత్రం అద్భుత నటన మరియు పోరాటాలు, పాటలు లేకుండా సినిమా రావడం ఆహ్వానించదగ్గ మార్పు అని కొనియాడారు. అలాగే చిత్ర సభ్యులు అందరికి అభినందనలు తెలిపారు.
హీరో కార్తీ చేసిన ప్రయోగాత్మక చిత్రం ఖైదీ అటు తమిళం మరియు తెలుగులో కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కేవలం ఒక రాత్రి నడిచే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Khaidi… new age filmmaking…thrilling action sequences and stellar performances in a gripping script… no songs!! A welcome change 🙂
Congratulations to the entire team @Karthi_Offl @itsNarain @sathyaDP @SamCSmusic @DreamWarriorpic and @Dir_Lokesh !! ????????????????????????— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2019


