వైరల్ : మహేష్ బాబు వాయిస్ ఓవర్ క్రేజ్..

వైరల్ : మహేష్ బాబు వాయిస్ ఓవర్ క్రేజ్..

Published on Feb 21, 2024 9:00 AM IST

టాలీవుడ్ సినిమాలో పలు చిత్రాలకి కొందరు స్టార్ హీరోలు తమ వాయిస్ ఓవర్ ని అందిస్తూ ఉండడం మనం చూస్తూనే వచ్చాం. అయితే ఈ వాయిస్ ఓవర్ లలో సూపర్ మహేష్ బాబు విషయంలో మాత్రం మంచి స్పెషాలిటీ ఉందని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా “జల్సా” నుంచి మహేష్ వాయిస్ ఓవర్ ఓ సినిమాకి ఇస్తున్నాడు అంటే అందరిలోని మంచి ఆసక్తి నెలకొనేది.

అయితే ఇప్పుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కి క్రేజ్ మరో లెవెల్ కి వెళ్ళింది అని చెప్పాలి. ప్రస్తుతం చాలా మంది వినియోగిస్తున్న పేమెంట్స్ యాప్ ఫోన్ పే కోసం తెలియని వాళ్ళు ఉండరు. ఇంకా ఎన్నో పేమెంట్స్ యాప్స్ ఉన్నా కూడా ఫోన్ పే పేరే ముందొస్తుంది. అయితే వీరు మహేష్ బాబు వాయిస్ తో టెక్నాలజీని యాడ్ చేసి తమ పేమెంట్స్ కోసం తీసుకొచ్చారు.

దీనితో ఈ సరికొత్త స్పీకర్స్ లో పేమెంట్స్ చేస్తే మహేష్ వాయిస్ లో ఇక మీద నుంచి వినిపించనున్నాయని చెప్పాలి. మరి ఈ న్యూస్ ఇలా బయటకి రాగానే మహేష్ ఫ్యాన్స్ లో యిట్టె వైరల్ అయ్యిపోయింది. దీనితో ఇది వినాలని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు