మహేష్ మేనల్లుడి సినిమా ప్రారంభమైంది !

mahesh nephew

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం ఈరోజు ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు.

నూతన దర్శకుడు శశి కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమా తోనే నటన పరంగా మంచి మార్కులు సంపాదించికున్న యువ హీరోయిన్ నాబా నటేష్ గల్లా అశోక్ కు జోడిగా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది.

Exit mobile version